Robin Uthappa

Robin Uthappa: ధోని ని ఫాలో అవుతున్న వైభవ్.. రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు

Vaibhav-MS Dhoni: టీమ్ ఇండియా యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ (RR) సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అనుసరిస్తున్న బ్యాటింగ్ టెక్నిక్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ ప్రారంభంలో వాడిన శైలినే పోలి ఉందంటూ ప్రశంసలు కురిపించారు.

ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఉతప్ప.. వైభవ్ వైవిధ్యమైన బ్యాటింగ్ స్టాన్స్, టెక్నిక్‌ల గురించి సమగ్రంగా వివరించారు.
ధోనీ లాగే బ్యాక్‌ఫుట్ గేమ్!
ఉతప్ప విశ్లేషణ ప్రకారం, వైభవ్ క్రీజ్‌లో నిలబడే తీరు ఇతర కుర్రాళ్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది..
  • బ్యాక్‌ఫుట్ అడ్వాంటేజ్: వైభవ్ ముందు పాదం మీద ఆడటానికి బదులు, క్రీజ్ లోపలికి వెెళ్లి బ్యాక్‌ఫుట్‌పై ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ధోనీ కూడా తన కెరీర్ తొలి రోజుల్లో యార్కర్లను, షార్ట్ పిచ్ బంతులను సిక్సర్లుగా మలచడానికి ఈ పద్ధతినే వాడేవాడు.
  • షాట్ల ఎంపిక: కొద్దిగా వంగి, ఆఫ్-స్టంప్‌కు వెలుపల గార్డ్ తీసుకుని నిలబడటం వల్ల బౌలర్ ఎలాంటి లెంగ్త్‌లో వేసినా (గుడ్ లెంగ్త్, బౌన్సర్, యార్కర్) సులభంగా పరుగులేసే వెసులుబాటు అతనికి లభిస్తుంది.
  • యువతకు స్ఫూర్తి: వైభవ్ అనుసరిస్తున్న ఈ సులువైన టెక్నిక్‌ను నేటి తరం యువ బ్యాటర్లు సులభంగా అనుకరించి నేర్చుకోవచ్చని ఉతప్ప అభిప్రాయపడ్డారు.

ఆరెంజ్ క్యాప్ పద్ధతి మారాలి.. ఉతప్ప సంచలన సూచన

ఇదే సందర్భంగా ఐపీఎల్‌లో ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (Orange Cap) నిబంధనలపై కూడా ఉతప్ప తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం అత్యధిక పరుగులు చేసిన వారికే కాకుండా, అత్యుత్తమ స్ట్రైక్ రేట్ (Strike Rate) ఉన్న బ్యాటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదించారు..
ఈ రోజుల్లో టి20 క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేయడమే కాదు, ఎంత వేగంగా చేశామన్నదే ముఖ్యం. 350 నుండి 400 పరుగులు చేసి అద్భుతమైన స్ట్రైక్ రేట్ సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం సరైన పద్ధతి. పాత పద్ధతులను మార్చి ఐపీఎల్ ఈ దిశగా పరిణామం చెందాల్సిన అవసరం ఉంది.
రాబిన్ ఉతప్ప (మాజీ క్రికెటర్)
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కేవలం 15 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో సెంచరీతో సహా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP) అవార్డును సొంతం చేసుకుని భారత జాతీయ జట్టులోకి కూడా ఎంపికైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *