Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ టీమ్ నుంచి వచ్చిన బర్త్‌డే ట్రీట్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Response) లభించింది. ఈ ప్రత్యేక సందర్భంలో మేకర్స్ ‘రుద్ర’ పాత్రలో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పోస్టర్లు, స్టిల్స్‌ను విడుదల చేశారు. రాజమౌళి సృష్టిస్తున్న అద్భుతమైన విజువల్ వరల్డ్‌ను, మహేష్ బాబు మాస్ అండ్ క్లాస్ లుక్‌ను ఈ స్టిల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అభిమానుల ఆనందం.. కొంత నిరాశ!
ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే సినిమా రిలీజ్‌కి ఇంకా సంవత్సరం సమయం ఉండటంతో, ఇప్పుడే వీడియో బైట్స్ వాడకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారేమో! ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా కూడా ఇలాంటి పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్‌కి ఎలాంటి సర్ ప్రైజెస్ ఇస్తారో చూడాలి.
