Robbery Attempt: విశాఖ నుంచి సికింద్రాబాద్ నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు పరారయ్యారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Robbery Attempt: ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మలచెరువు వద్ద ఏడుగురు సభ్యులు ఉన్న ముఠాపై ముందుగానే పోలీసులు అనుమానంతో పసిగట్టారు. వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున చోరీకి పాల్పడుతుండగా, తేరుకున్న పోలీసులు అప్రమత్తమై గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని పలు కోచ్‌లను లక్ష్యంగా చేసుకొని చోరీకి యత్నించాయి. ప్రయాణికుల నుంచి సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తం రైలు దిగి పారిపోయారు. దీంతో అంతా సేఫ్ అయ్యారు.
Robbery Attempt: ఇదిలా ఉండగా, బీహార్, మహారాష్ట్రలకు చెందిన గ్యాంగులు వరుసగా రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో రైల్వే పోలీసులు రైళ్లలో గట్టి నిఘా ఉంచుతున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీలు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ సారి మరో చోరీకి ప్లాన్ బెడిసికొట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.