Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని పిలిపిట్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఖాదీమా జిల్లా జమోర్ గ్రామానికి చెందిన 11 మంది సభ్యులతో కూడిన కుటుంబం తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ‘మారుతి ఎర్టిగా’ కారులో ఉత్తరప్రదేశ్‌లోని పిలిపిట్ జిల్లాలోని సండోయ్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో వాహనం తునాతునకలైపోయింది.
అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ ప్రాంతానికి చెందిన 11 మంది వ్యక్తులు మరణించిన వారి కుటుంబ సభ్యుని కర్మకాండ జరిపించడానికి ప్రయాగ్ రాజ్ వెళ్లారు. మహీంద్రా బొలెరో వాహనంలో తిరిగి వెళుతున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఇది కూడా చదవండి: AP news: మెగా పేరెంట్ టీచర్.. విద్యార్థులతో ముచ్చటించిన సీఎం బాబు
Road Accident: ఇక మరో ఘటనలో నిన్న మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులతో ఢిల్లీకి లగ్జరీ బస్సు బయలుదేరింది. బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని చక్రవా సెక్షన్‌లో వెళుతోంది సమయంలో మార్గమధ్యలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక లారీ ఆగి ఉంది. దీనిని బస్సు డ్రైవర్ గమనించలేదు. దీంతో బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణీకులు స్పాట్ లో చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదాల్లో 20 మంది మృత్యువాత పాడడం జరిగింది.