Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెలలో హత్యకు గురైన కాంగ్రెస్ లీడర్ బాబా సిద్దీకి మర్డర్, గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలతో పాటు మరో 17 క్రిమినల్ కేసుల్లో అన్మోల్‌‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో హంతకులుగా ఉన్న వ్యక్తులతో అతడు ఓ మెసేజింగ్ యాప్‌లో చాట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ 2023లో అతడిపై చార్జిషీటు దాఖలు చేసింది.అయితే అన్మోల్ ఇప్పటికే నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడని, అతడు ఎప్పటికప్పుడు తన లొకేషన్‌లను మారుస్తూ దొరక్కుండా తిరుగుతున్నాడని, గత సంవత్సరం కెన్యాలో కనిపించిన అన్మోల్.. ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలైన అతడు ఆ తర్వాత నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana assembly: భ‌ట్టి విక్ర‌మార్క అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని బీఆర్ఎస్ స‌భ్యుల వాకౌట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *