Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ముంబై పర్యటనకు వెళ్లారు. అక్కడ మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
సల్మాన్ ఖాన్‌తో సీఎం భేటీ
ఈ వివాహ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాలీవుడ్ ప్రముఖులతో ఆత్మీయ భేటీలు జరిగాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: డీప్‌ఫేక్‌పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి
ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వివాహ వేడుకకు హాజరైన ప్రముఖులు
ఈ హై-ప్రొఫైల్ వివాహ వేడుకకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్. రాజకీయ ప్రముఖులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ సీఎం అశోక్ చవాన్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ముకేశ్, నీతా అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ ప్రముఖుల కలయికలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.


