Revanth Reddy: నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, వైఫల్యాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభలో అయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని, ప్రజలపై మోపిన ఆర్థికభారం గురించి ధ్వజమెత్తారు.
రూ.1.30 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ పాలనలోనే ప్రజలపై మోపబడ్డది. ప్రజాధనాన్ని లూటీ చేసి ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అని రేవంత్ అన్నారు. నిధులు మొత్తం కేంద్రం నుంచి వస్తుంటే కమీషన్ల కోసం ప్రాజెక్టుల డిజైన్లను మార్చేశారు అని రేవంత్ ఆరోపించారు.
మేడిగడ్డలోనే లోపాల ముద్ర
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధాన కారణం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలోనూ, డిజైన్‌లోనూ ఉన్న లోపాలేనని సీఎం తెలిపారు. ప్రాజెక్టు సాంకేతికతను మార్చింది హరీష్‌రావే. కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసం, కమీషన్ల కోసం లిఫ్ట్‌లు పెంచారు. ఒకే లిఫ్ట్‌తో సాధ్యమైన నీటికి లక్షకోట్ల రూపాయలు పెట్టారు. ఇలాంటివి అన్నీ అవినీతికి నిదర్శనం, అన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: పేదలకు పెద్దన్నగా చంద్రన్న.. CM గానేటితో 30ఏళ్లు పూర్తి..!
అధికారుల లేఖలతోనే ఆధారాలు
మేడిగడ్డలో లోపాలున్నాయని అప్పట్లోనే అధికారులు లేఖ రాశారు. కానీ వాటిని పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వం. వ్యాప్కోస్ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సింది. కానీ కేసీఆర్ పాలనలో ఆ నియమాలు పట్టించుకోకుండా కమీషన్ల కోసం డిజైన్లు మార్చేశారు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమే నిధులిచ్చిన ప్రాజెక్టులను విస్మరించారు
కేంద్ర నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్టులను కూడా కేసీఆర్ వదిలేశారు అని సీఎం విమర్శించారు. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు ఇప్పటికీ బలంగా, చెక్కుచెదరకుండా ఉంది. కానీ లక్షకోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయింది. ఇంతటి అవినీతిని క్షమించాలా? శిక్షించకూడదా?” అని సభలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అవినీతికి ప్రతీకగా మారిన కాళేశ్వరం
కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. కేంద్ర సంస్థ NDSA కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే ప్రాజెక్టును ఇలాగు మార్చారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఈ అవినీతి పెద్దలను ప్రజా న్యాయస్థానంలో నిలబెట్టడం తప్పద,” అని రేవంత్ హెచ్చరించారు.