Republic Day 2025: మనదేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రతి ఏటా జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ఏదైనా దేశాధినేతను ముఖ్య అతిథిగా మన దేశం ఆహ్వానిస్తుంది. ఈ సారి ఈ నెల 26న జరగనున్న 76వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా దేశ అధ్యక్షుడిని మన దేశం ఆహ్వానించింది. ఈ సందర్భంగా జరిగే వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడితోపాటు ఆ దేశ ప్రతినిధుల బృందం పాల్గొననున్నది.
Republic Day 2025: ఇండినోషియా దేశ అధ్యక్షుడైన ప్రభోవో సుబియాంతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. ఆయన పర్యటన సందర్భంగా మన దేశ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్‌తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ప్రభోవో సుబియాంతో సమావేశం కానున్నారు.
Republic Day 2025: ఈ సారి ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ వేడుకల కోసం 15 వేల మంది పోలీసులు, ఆరు అంచెల భద్రత, నగరం చుట్టూ వేలాది సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టే 1,000 కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతటా 35 హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.


