AP News: ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. క్వింటాల్ మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను రూ.1,490గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో చెల్లించనున్నాయి. రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఈ రుసుములు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయంతో మామిడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ తోతాపురి మామిడి రైతులకు భారీ ఊరట..
మార్కెట్ జోక్యం పథకం అమలుకు కేంద్రం అంగీకారం.. ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి కేంద్రం లేఖ..1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు…క్వింటాల్ కు రూ. 1493.73కు కొనుగోలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా నిర్ణయం..… pic.twitter.com/NdUciwwbTr
— s5news (@s5newsoffical) July 22, 2025

