Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పదవీ ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే ఆమెతోపాటు ఆరుగురు మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా, నాలుగో మహిళా సీఎంగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, 12 రాష్ట్రాల ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు, బీజేపీ, కూటమి జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Rekha Gupta: రామ్‌లీలా మైదానం ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాతోపాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిచేత లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రమాణం చేయించారు. బీఆర్ఎస్ శ్రేణుల కేరింతల నడుమ వారంతా ఉత్సాహంగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి ఎంపికలో ఆచీతూచి అడుగులేసిన బీజేపీ అధిష్టానం.. శాఖల కేటాయింపులో కూడా వ్యూహాత్మకంగా నిర్ణయించింది.
మంత్రులు – శాఖలు
ముఖ్యమంత్రి రేఖాగుప్తా – హోం, ఆర్థిక, విజిలెన్స్ శాఖలు
పర్వేశ్ వర్మ – విద్య, పబ్లిక్ వర్క్స్ శాఖలు
రవీందర్ ఇంద్రజ్ – సాంఘిక సంక్షేమ శాఖ
ఆశిష్ సూద్ – రెవెన్యూ పర్వావరణ శాఖ
మంజీందర్ సింగ్ సిర్సా – ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖలు
కపిల్ మిశ్రా – పర్యాటక శాఖ
పంకజ్ సింగ్ – హౌజింగ్ శాఖ