Game Changer

Game Changer: ఐమాక్స్ వర్షన్ లో ‘గేమ్ ఛేంజర్’

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూడు భాషల్లో జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా 4వ తేదీ రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. లార్జ‌ర్‌ దేన్ లైఫ్ వంటి ఈ సినిమాను లార్జ‌ర్ స్క్రీన్‌లో ఆడియెన్స్ కు చూపించాలనుకుంటున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. అందుకోసం ఐమాక్స్ లలో దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘వావ్ అనిపించే విజువ‌ల్స్‌, అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలతో ప‌క్కాగా రూపొందిన ఈ చిత్రం మ‌న‌దేశంతో పాటు అంత‌ర్జాతీయంగా ఐమ్యాక్స్ థియేట‌ర్స్ లో ప్రదర్శిస్తామని, ఇది ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళుతుందనే నమ్మక ఉందని దిల్ రాజు చెప్పారు. ఈ సినిమా తన హృదయానికి దగ్గరైన చిత్రమని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఐమాక్స్ లో చూసే అవకాశాన్ని కల్పించడం తనను ఎగ్జయిట్ మెంట్ కు గురిచేస్తోందని రామ్ చరణ్ అన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Raghava Lawrence: లారెన్స్ తో రమేష్ వర్మ ‘కాలభైరవ’!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *