హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై వినేష్ గెలుపొందారు. మొదటినుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరి రౌండ్ వచ్. సరికి ఆరు వేల పైచిలుకు ఓట్లతో యోగేష్‌పై రెజ్లర్ విజయం సాధించారు.
మరోవైపు హర్యానాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది.