Mangalagiri: పుష్ప సినిమాను ఫాలో అయ్యారు కొందరు కేటుగాళ్లు. సినిమాలో చూపినట్లుగా కొంతమంది అక్రమార్కులు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎవరూ పట్టుకోకపోతే యథేచ్ఛగా దేశం దాటిపోతాయని భావిస్తున్నారు. రూ. లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా, మంగళగిరి పోలీసులు వారి గుట్టును రట్టు చేశారు.పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం, ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మంగళగిరి పోలీసులు అన్ని చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళుతున్న ఒక లారీని తనిఖీ చేస్తూ, పేపర్ బండిళ్ల మధ్య దాగి ఉన్న 10 టన్నుల ఎర్రచందనాన్ని గుర్తించారు. వెంటనే డ్రైవర్ ను అదుపులోకి తీస్కున్నారు. పోలీసులు సరుకును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీని వెనక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

