RBI Jobs 2025

RBI Jobs 2025: రిజర్వ్ బ్యాంక్​లో 120 ఆఫీసర్​ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు!

RBI Jobs 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 120 గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు:
మొత్తం పోస్టులు: 120

పోస్టుల వారీగా ఖాళీలు:

* గ్రేడ్ బి ఆఫీసర్స్ (DR) – జనరల్: 83

* గ్రేడ్ బి ఆఫీసర్స్ (DR) – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ (DEPR): 17

* గ్రేడ్ బి ఆఫీసర్స్ (DR) – డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (DSIM): 20

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

* చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025 (సాయంత్రం 6 గంటల వరకు)

దరఖాస్తు రుసుము:

* జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: ₹850

* ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: ₹100

అర్హతలు:
గ్రేడ్ బి ఆఫీసర్స్ (జనరల్):

* ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50%).

* లేదా, 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కులే సరిపోతాయి).

* సీఏ ఫైనల్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే.

గ్రేడ్ బి ఆఫీసర్స్ (DEPR):

* ఎకనామిక్స్, ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్ లేదా సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* పీజీడీఎం/ఎంబీఏ (ఫైనాన్స్) లేదా పరిశోధన/బోధన అనుభవం ఉన్నవారు కూడా అర్హులు.

గ్రేడ్ బి ఆఫీసర్స్ (DSIM):

* స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ చేసి ఉండాలి.

* ఐఎస్‌ఐ నుంచి ఎం.స్టాట్. లేదా పీజీడీబీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:
* వయస్సు: జూలై 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

* వయో సడలింపు: ఎంఫిల్ చేసిన అభ్యర్థులకు 32 సంవత్సరాల వరకు, పీహెచ్‌డీ చేసిన వారికి 34 సంవత్సరాల వరకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ & పరీక్షల షెడ్యూల్:
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

1. ప్రిలిమినరీ పరీక్ష (ఫేజ్-I)

2. మెయిన్ పరీక్ష (ఫేజ్-II)

3. ఇంటర్వ్యూ

పరీక్ష తేదీలు:

* ఫేజ్-I పరీక్ష (జనరల్): అక్టోబర్ 18, 2025

ALSO READ  Kajol: రామోజీ ఫిల్మ్ సిటీలో భయానక అనుభవం: కాజోల్ షాకింగ్ కామెంట్స్..!

* ఫేజ్-I పరీక్ష (DEPR, DSIM): అక్టోబర్ 19, 2025

* ఫేజ్-II పరీక్ష (జనరల్): డిసెంబర్ 6, 2025

* ఫేజ్-II పరీక్ష (DEPR, DSIM): డిసెంబర్ 6, 2025

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *