ఆట ఫెయిల్.. ర్యాంకులు ఢమాల్

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కోహ్లీ మొత్తం 23 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ మొత్తం 11 పరుగులే చేశాడు.

దీంతో వీరి ఆట ఇప్పుడు టెస్టు ర్యాంకింగ్స్‌ పైన పడింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌ కిందికి పడిపోయాయి. టాప్‌ టెన్‌ నుంచి పడిపొయి ప్రస్తుతం 12వ స్థానంలో కోహ్లీ కొనసాగుతుండగా.. రోహిత్ కూడా ఐదు స్థానాలు కోల్పోయి పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

ఇక సెంచరీతో ఆకట్టుకున్న రిషభ్‌ పంత్‌కు టాప్‌ టెన్‌లో చోటు దక్కింది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక యశస్వి జైస్వాల్‌.. ఐదో స్థానంలోకి వచ్చాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లలో అతడిదే ఉత్తమ స్థానం కావడం విశేషం. బౌలర్ల విషయానికి వస్తే.. ఉత్తమ టెస్టు బౌలర్‌గా అశ్వినే కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో బుమ్రా, ఆరో స్థానంలో జడేజా ఉన్నారు.

ఇక బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత స్క్వాడ్‌లో మార్పులు లేవని బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 27నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరగనుంది.

స్క్వాడ్: రోహిత్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *