రతన్ టాటా లవ్ స్టొరీ.. సినిమాను మించిన ట్విస్టులు

ప్రముఖ పారిశ్రామిక‌వేత్త‌ రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు క‌న్నుమూశారు. అయితే రతన్ టాటా అమెరికాలో జాబ్ చేస్తున్న టైమ్ లో ఆయనకో లవ్ స్టొరీ ఉండేది. అదేంటో తెలుసుకుందాం..

రతన్ టాటా లాస్ ఏంజిల్స్ లో జాబ్ చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అలా ప్రేమ మైకంలో కొద్దిరోజులు విహరించిన తాతకు ఇండియా నుంచి ఓ ఫోన్ వచ్చింది. భారత్ లోని తన అమమ్మకు హెల్త్ బాగోలేదని కాల్ వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఇండియా కు వచ్చారు. ఇదే టైమ్ లో

భారత్, చైనా మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. ఆ సమయంలోనే రతన్ టాటా అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే.. ఈ యుద్ధం రతన్ టాటా లవ్ స్టోరీలో మెయిన్ విలన్‌గా మారింది. యుద్ధం మీద భయంతోనో.. కూతురి మీద ప్రేమతోనో కానీ.. ఆ అమ్మాయిని ఇండియాను పంపేందుకు ఆమె తల్లిదండ్రులు మాత్రం ఎంతకూ అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య ఎడబాటు పెరిగింది. ఫలితంగా.. వారిద్ధరి ప్రేమ.. ప్రేమ దగ్గరే ఆగిపోయింది.. పెళ్లిపీటలెక్కే వరకు చేరుకోలేకపోయింది.

రతన్ టాటా ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి చేసుకుందో లేదే తెలియదు కానీ.. ప్రియురాలి జ్ఞాపకాలతో రతన్ టాటా మాత్రం చివరి వరకూ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు.

తన లవ్ స్టోరీ గురించిన ఎవ్వరికీ తెలియని విషయాలను.. గతంలో ప్రఖ్యాత హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్‌ టాటానే స్వయంగా రివీల్ చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *