Rashmika-Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రశ్మిక ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చాలా కాలంగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక పండగల సందర్భంగా ఇద్దరూ వేరు వేరుగా పిక్స్ ను పోస్ట్ చేసినా బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే కాకుంటే వేరు వేరుగా పెట్టారంటూ పలుమార్లు ఆధారాలతో ప్రకటిస్తూ వచ్చింది సోషల్ మీడియా. ‘గీత గోవిందం’ లో వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా పండుతూ వచ్చిందని, ఇక ‘డియర్ కామ్రేడ్’తో అది పీక్స్ లోకి వెళ్లిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, రశ్మిక కలసి ఇటీవల ఓ స్నేహితురాలి వివాహానికి హాజరవటంతో మరోసారి వారిద్దరి పెళ్ళి వార్త అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Dhanush vs Nayanthara: ధనుష్ వర్సెస్ నయన్!
Rashmika-Vijay Devarakonda: స్నేహితురాలి పెళ్ళి వేడుకలో రశ్మిక బనారస్ చీరలో, విజయ్ దేవరకొండ షేర్వాణీలో మెరిశారు. ఇద్దరూ ఎంట్రీ వేరే వేరుగా ఇచ్చినప్పటికీ జంటగా పెళ్ళిలో హైలైట్ అయ్యారట. ఇక ఆ పెళ్ళిలో కీర్తి సురేశ్, నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, ఆనంద్ దేవరకొండ సందడి చేశారు. ప్రస్తుతం రశ్మిక నటించిన ‘పుష్ప2’, విక్కీ కౌశల్ ‘చావా’ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ వచ్చే ఏడాది రానుంది. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్నాడు. మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ వస్తున్న వీరిద్దరూ రియల్ లైఫ్ లో ఒక్కటవుతారా? లేక డేటింగ్ వార్తలను సోషల్ మీడియాకే పరిమితం చేస్తారా? అన్నది వేచి చూడాలి.