Uttar Pradesh: యూపీలోని బిజ్నోర్‌లో జార్ఖండ్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న వధూవరులతో సహా 7 మంది మరణించారు. జాతీయ రహదారి-74పై రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వివాహం అనంతరం కుటుంబం జార్ఖండ్ నుండి రైలులో తిరిగి వచ్చింది. అద్నరూ మొరాదాబాద్ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ఆటోలో బిజ్నూర్‌లోని ధాంపూర్‌కు వెళ్తున్నారు. ఇంతలో ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వరుడి ఇల్లు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని ఎస్పీ అభిషేక్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Air Pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకరస్థాయికి కాలుష్యం
Uttar Pradesh: బిజ్నోర్‌లోని తిబ్రి గ్రామానికి చెందిన ఖుర్షీద్ కుటుంబంతో సహా తన కొడుకు విశాల్ పెళ్లి కోసం జార్ఖండ్‌లోని మధుపురా జిల్లా పరోహాబాద్ గ్రామానికి వెళ్లారు. నవంబర్ 14న పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక వధూవరులు, కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి వస్తున్నాడు. అతనితో పాటు పెళ్ళికొడుకు విశాల్, పెళ్లికూతురు ఖుషి, అత్త రూబీ, మామ ముంతాజ్, కోడలు బుష్రా, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రమాదంలో ఆటోడ్రైవర్ అజబ్ తో సహా వీరంతా మరణించారు.