Rashmika Mandanna: కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న యానిమల్, పుష్ప 2 సినిమాలతో పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమాతో అయితే టాప్ హీరోయిన్ గానే మారిపోయింది. అయితే సక్సెస్ ని వచ్చిన ఫేమ్ ని ఎంజాయ్ చెయ్యకుండా సోషల్ మీడియాలో ఏవేవో పోస్టులు పెడుతూ ట్రోల్స్ కి గురవుతుంది రష్మిక. తాజాగా ఓ పోస్ట్ పెట్టి నెటిజన్స్ కామెంట్స్ కి బలవుతుంది.’KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను.మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు ఓ రేంజ్ లో వస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ ఫ్యాన్స్ ఆమె గతంలో చేసిన కామెంట్స్ ని గుర్తు చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక విక్కీ కౌశల్ తో చావా అనే బాలీవుడ్ సినిమా చేస్తుంది.
View this post on Instagram