Rashmika: రాష్మికకు బుద్ధి చెబుతాం.. కాంగ్రెస్ ఎమ్మల్యే..

Rashmika: కన్నడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరుకావలసిందిగా ఆహ్వానించినా, నటి రష్మిక మందన్న రాకపోవడంతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ భాషల్లో నటిస్తున్న రష్మిక, కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మండి ఎమ్మెల్యే రవికుమార్ గౌడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“రష్మికకు బుద్ధి చెప్పాలి” – ఎమ్మెల్యే రవికుమార్ గౌడ

రవికుమార్ మాట్లాడుతూ, “రష్మిక తన సినీ కెరీర్‌ను ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ మూవీతో మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదు. ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాల్సిందిగా గతేడాది ఆమెను మేము పలుమార్లు కోరినా, ఆమె అంగీకరించలేదు. తనకు రావడానికి సమయం లేదని, తాను హైదరాబాదీయినని చెప్పింది. కన్నడ ఇండస్ట్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆమెకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.” అని వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక

బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమం లో ప్రముఖ నటీనటులు పాల్గొనకపోవడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

“సినిమా రంగానికి ప్రభుత్వం మద్దతు అవసరం. కానీ చిత్రపరిశ్రమకు చెందిన వారు రాష్ట్రంలోని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనకపోతే, ఫిల్మ్ ఫెస్టివల్ వల్ల ప్రయోజనం ఏమిటి? ఒకవేళ నటీనటుల తీరు మారకపోతే, వారిని ఎలా సరి చేయాలో నాకు బాగా తెలుసు” అని డీకే శివకుమార్ హెచ్చరించారు.

కన్నడ సినీ ఇండస్ట్రీపై రష్మిక నిర్లక్ష్యమా?

ఈ ఘటనపై కన్నడ సినీ ప్రియులు, రాజకీయ నాయకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రష్మికను కన్నడ సినీ ఇండస్ట్రీ ఎదిగించిందని, కనీసం తమ రాష్ట్ర ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరుకావాల్సిందని అంటున్నారు. మరొకవైపు, ఆమె కెరీర్ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయికి వెళ్లిందని, వ్యక్తిగత కారణాలతో రాలేకపోయి ఉండొచ్చని ఆమె అభిమానులు అంటున్నారు.ఈ వివాదంపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ambati Rambabu: పోలవరంపై చర్చకు సిద్ధం.. చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రాజెక్టు నాశనానికి కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *