Bengaluru

Bengaluru: బెంగళూరులో రాపిడో డ్రైవర్‌ దౌర్జన్యం: మహిళా ప్రయాణికురాలిపై దాడి

Bengaluru: బెంగళూరులో మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని జయనగర్‌లో ఒక రాపిడో (Rapido) బైక్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా (ర్యాష్ డ్రైవింగ్) నడుపుతున్నాడని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన డ్రైవర్ ఆమెపై చేయి చేసుకున్నాడు.

ఘటన వివరాలు : 
బాధితురాలు రాపిడో బైక్‌ను బుక్ చేసుకుని వెళ్తుండగా, డ్రైవర్ బైక్‌ను చాలా వేగంగా నడిపాడని సమాచారం. దీనిపై యువతి డ్రైవర్‌ను నిలదీయగా, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బైక్ దిగిన తర్వాత డబ్బులు చెల్లించడానికి యువతి నిరాకరించడంతో, డ్రైవర్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. ఈ దాడితో యువతి అక్కడికక్కడే నేలపై పడిపోయింది.

Also Read: Bengaluru: కర్నాటకలో బైక్‌ ట్యాక్సీ సేవలపై హైకోర్టు నిషేధం – అక్రమ సేవలపై ఆర్టీవో దాడులు

వైరల్ అవుతున్న వీడియో, పోలీసుల దర్యాప్తు : 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. వీడియోలో డ్రైవర్ మహిళపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల, ముఖ్యంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాపిడో వంటి రైడ్-షేరింగ్ సంస్థలు తమ డ్రైవర్ల ప్రవర్తనపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *