Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బుచ్చిబాబు సన (ఉప్పెన ఫేమ్) దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’ . ఈ పాన్ ఇండియా సినిమాపైన అంచనాలు భారీగా ఉండగా, మేకర్స్ తాజాగా ఫస్ట్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
తెలుగులో మనకి ఫస్ట్ సాంగ్ అంటే లిరికల్ సాంగ్ విడుదల చేయడం అలవాటైపోయింది. పూర్తి వీడియో సాంగ్ సినిమాలోనే చూసేవలం. కానీ పాన్ ఇండియా సినిమా అని వచ్చిన తర్వాత బాలీవుడ్ వాళ్లు చేస్తున్న విధంగా మన తెలుగు వాళ్ళుకూడా మొదటగా వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా పెద్ది సినిమా నుండి కూడా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
‘పెద్ది’ మూవీ విశేషాలు
‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచీ హైప్ నెలకొంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ‘దేవర’ తర్వాత జాన్వీకి ఇది రెండో తెలుగు సినిమా. ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయి ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించనుంది.
ఇది కూడా చదవండి: Chevella Bus Accidetnt: చేవెళ్ల రహదారి విస్తరణలో ఎందుకు ఆలస్యం జరిగింది: సుప్రీంకోర్టు కమిటీ సీరియస్
కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇది పూర్తిస్థాయి రూరల్ బ్యాక్‌డ్రాప్లో, స్పోర్ట్స్ నేపథ్యంలో నడిచే డ్రామాగా తెలుస్తోంది. చరణ్ ఇందులో పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నారు.
సంచలనం సృష్టిస్తున్న ‘చికిరి.. చికిరి’
‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి వీడియో సాంగ్ అయిన ‘చికిరి.. చికిరి’ పాట విడుదలైంది. ఏఆర్ రెహమాన్ అందించిన మాస్ మ్యూజిక్ ఇప్పుడు సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. రెహమాన్ మార్క్ బీట్, చరణ్ ఎనర్జీ ఈ పాటను ఒక రేంజ్‌కి తీసుకెళ్లాయి.
చికిరి చికిరి’ అంటూ సాగే ఈ పాటకు రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో వెస్ట్రన్ స్టెప్పులతో అదరగొట్టారు. చరణ్ స్టెప్పుల ఎనర్జీ చూసిన అభిమానులు, ‘చిరుత’ తర్వాత ఆ రేంజ్ ఎనర్జీ చూశామని కామెంట్స్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్ లుక్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. పల్లెటూరి అమ్మాయిగా ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్‌తో ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

