Ramayana: బాలీవుడ్‌లోని అతి పెద్ద అవైటెడ్ మూవీ రామాయణపై క్రేజీ రూమర్ వినిపిస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, కాజల్ కీలక పాత్రల్లో.. నితీష్ తివారి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ భారీ విజువల్ వండర్ గ్లోబల్ లెవెల్‌లో అదరగొట్టనుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు టాక్. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు, ఎక్కడ లాంచ్ అవుతుంది? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Prabhas: ప్రభాస్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కు ట్రిపుల్ సర్‌ప్రైజ్!
రామాయణ చిత్రం బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మధ్యలో వచ్చిన గ్లింప్స్‌తోనే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా గ్లోబల్‌గా ఆకట్టుకుంటుందని అంతా నమ్ముతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది. ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారట మేకర్స్. అందుకోసం గ్లోబల్ వేదికని ఎంచుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్‌లో వచ్చే ఏడాది జూలైలో ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి. మొత్తానికి ఈ భారీ విజువల్ వండర్ గ్లోబల్ లెవెల్‌లో అదరగొట్టనుంది.