RGV-Mohit Suri: సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరికి ఒక్క స్టైల్స్ ఉంటాయి.. అందులో ఒకరు ఇండియన్ సినిమాకు రా అండ్ రస్టిక్ అండర్‌వరల్డ్ సినిమాలను పరిచయం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మరొకరు భావోద్వేగ ప్రేమకథలతో గుండెల్ని పిండేసే ఎమోషనల్ సినిమాలను తెరకెక్కించే మోహిత్ సూరి! వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ.. ఆర్జీవీ కథ, నిర్మాణ సహకారంతో మోహిత్ సూరి దర్శకత్వంలో ఓ ఇంటెన్స్ క్రైమ్ డ్రామా అధికారికంగా ఖరారైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఆర్జీవీ తనదైన శైలిలో చేసిన ప్రకటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
కథా నేపథ్యం – దావూద్ vs ఛోటా రాజన్ చీలిక..
అండర్‌వరల్డ్ చరిత్రలోని అత్యంత భయానక అధ్యాయాన్ని, మోహిత్ సూరి ఎమోషనల్ నెరేటివ్‌తో ఆర్జీవీ మార్క్ స్టోరీ టెల్లింగ్ ఎలా చూపిస్తుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
