Allu Arjun: భారతీయ సినీ పరిశ్రమలోనే కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక దృశ్య కావ్యం ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 5న అంతర్జాతీయంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్ ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రత్యేక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
సినిమా కాదు.. మన సంస్కృతికి ప్రతిబింబం.. అల్లు అర్జున్ భావోద్వేగ సందేశం
-
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్: రాముడి పవిత్రమైన, ప్రశాంతమైన పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు.
-
సీతాదేవిగా సాయిపల్లవి: నాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ అద్భుతంగా ఒదిగిపోయారు.
-
రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్: కన్నడ అగ్ర కథానాయకుడు యశ్ రావణుడి పాత్రలో అత్యంత శక్తిమంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించనున్నారు.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్..
My best wishes to the entire #Ramayana team. It’s not just a movie. It’s a representation of our culture and an attempt to raise the bar of Indian films. I wholeheartedly send my pure, positive wishes to the entire team for their divine attempt. Let’s all unite and come forward to support a pure attempt that carries our stories, our culture and our glory. Jai Sri Ram 🙏🏽
#RanbirKapoor @TheNameIsYash @Sai_Pallavi92 @iamsunnydeol @niteshtiwari22 @malhotra_namit @arrahman @HansZimmer @raviedubey @LaraDutta @Rakulpreet @vivekoberoi @AnupamPKher @MsKajalAggarwal
— Allu Arjun (@alluarjun) November 4, 2026
