Golden Ganesh: హైదరాబాద్లో వినాయక చవితి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ లడ్డూ మాత్రమే. కానీ ఈసారి భాగ్యనగరంలో మరో అద్భుతం వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ సమీపంలోని బేగంబజార్ ఫీల్ఖానా వీధుల్లో కొలువుదీరిన ఒక వినాయక ప్రతిమ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిలువెల్లా బంగారు కాంతులతో మెరిసిపోతూ, లక్షలాది వజ్రాల తళతళలతో దర్శనమిస్తున్న ఈ ‘గోల్డెన్ గణపతి’ని చూడటానికి భక్తులు బారులు తీరుతున్నారు.
విగ్రహ విశేషాలు – 8 నెలల అద్భుత సృష్టి..
విగ్రహం విలువ, భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని మండపం చుట్టూ ప్రత్యేక సీసీ కెమెరాల నిఘా, ప్రైవేట్ బౌన్సర్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ బంగారు పూత విగ్రహాన్ని భద్రపరిచి, నిమజ్జనం కోసం ప్రత్యేకంగా పర్యావరణహిత మట్టి వినాయకుడిని మాత్రమే వాడతామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
