Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. జాన్వీ కపూర్‌తో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఇద్దరూ ప్రత్యేక ఫ్లైట్‌లో అక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Chiranjeevi: డీప్‌ఫేక్‌పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి
పెద్ది సినిమాపై అంచనాలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. శ్రీలంకలో వారం రోజుల షెడ్యూల్‌లో లవ్ సాంగ్ షూట్ పూర్తవుతుంది. జాన్వీ కపూర్‌తో రామ్ చరణ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఇద్దరూ ప్రత్యేక ఫ్లైట్‌లో అక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో జాన్వీ వైట్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. చరణ్ లుక్ గూస్‌బంప్స్ ఇచ్చింది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ హైదరాబాద్‌లోని రెహమాన్ ఈవెంట్‌లో విడుదల కానుందని టాక్. ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్‌లో కనిపిస్తాడట. ఇది యాక్షన్, ఎమోషన్ కలిసిన కథ. శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీ రోల్స్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 27, 2026న పాన్-ఇండియా రేంజిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.


