Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు రెండవసారి తల్లి కాబోతున్నారు. ఈ శుభవార్తను అక్టోబర్ 2025లో దీపావళి సందర్భంగా జరిగిన సీమంతం వేడుక వీడియోను పంచుకోవడం ద్వారా ఉపాసన అధికారికంగా ప్రకటించారు. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీమంతం వేడుక వీడియోను షేర్ చేస్తూ, “ఈ దీపావళి రెట్టింపు వేడుక, రెట్టింపు ప్రేమ మరియు రెట్టింపు ఆశీర్వాదాలతో నిండిపోయింది” అని క్యాప్షన్ ఇచ్చారు, తద్వారా రెండవ గర్భం గురించి ధృవీకరించారు. ఈ వేడుకలో రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ, అలాగే ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ వార్తతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది.
Also Read: Nara Rohit: నారా రోహిత్ పెళ్లి డేట్ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుక
అభిమానులు చరణ్- ఉపాసన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో వారి మొదటి ఆడపిల్ల క్లీంకార కొణిదెల జన్మించింది. ఉపాసన గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొదటి బిడ్డ విషయంలో ఆలస్యం చేసినందుకు, రెండో బిడ్డ విషయంలో ఆ పొరపాటు చేయకుండా త్వరగా ప్లాన్ చేసుకుంటానని వెల్లడించారు. వాస్తవానికి, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్‌తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఉపాసన మెట్లు దిగుతూ కనిపించగా, రామ్ చరణ్ ఆమె చేయి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా దించడం కనిపించింది. అంతేకాకుండా, ఉపాసన తన పొట్ట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లు గమనించినప్పటి నుంచే ఆమె ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు జోరందుకున్నాయి.
Double the Love & Double the blessings 👶🏻👶🏻@AlwaysRamCharan & @upasanakonidela going to become Parents for the Second time ❤️❤️ pic.twitter.com/pCunSgycfp
— Trends RamCharan ™ (@TweetRamCharan) October 23, 2025