Rajeev Kanakala: తల్లిదండ్రులు లక్ష్మీ కనకాల, దేవదాస్ కనకాల దక్షిణాది చిత్రసీమలో ఎంతోమంది సూపర్ స్టార్స్ ను తయారు చేసిన నటశిక్షకులు. వారి తనయుడు రాజీవ్ కనకాల కూడా కన్నవారి శిక్షణలో తర్ఫీదు పొంది నటునిగా మారారు. ఆరంభంలో అందివచ్చిన పాత్రల్లో అభినయించిన రాజీవ్ కనకాల కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించారు. ఆ పై కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా, విలన్ గా పయనించారు.
ఇది కూడా చదవండి: Miss You Teaser: విడుదలైన సిద్ధార్థ్ ‘మిస్ యు’ టీజర్
Rajeev Kanakala: అనేక విలక్షణమైన పాత్రల్లో రాజీవ్ కనకాల నటన జనాన్ని ఆకట్టుకుంది. వైవిధ్యంతో సాగుతున్న రాజీవ్ చెంతకు ఈ నాటికీ వైవిధ్యమైన పాత్రలు వస్తూనే ఉన్నాయి. వాటిలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించే ప్రయత్నం చేస్తున్న రాజీవ్ నవంబర్ 13న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాజీవ్ భార్య సుమ ప్రఖ్యాత యాంకర్ గా రాణిస్తున్నారు. వారి కుమారుడు రోషన్ కొన్ని చిత్రాల్లో కనిపించారు. ఏది ఏమైనా వైవిధ్యమే ఆయుధంగా సాగుతున్న రాజీవ్ మునుముందు కూడా అదే తీరున అలరిస్తారని ఆశిద్దాం.