Mahesh Babu Fans: సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న చిత్రంపై మామూలు అంచనాలు లేవు. అయితే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ అభిమానులు మొదటి నుంచీ SSMB29 సినిమా అనే ట్యాగ్ తో పిలుచుకుంటున్నారు. అయితే ఇది తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు పేరు కలిసేలా SSRMB అనే కొత్త ట్యాగ్ తో వచ్చింది.కానీ దానిని మహేష్ అభిమానులు ఏమాత్రం ఒప్పుకోలేదు. అస్సలు యాక్సెప్ట్ చెయ్యలేదు. సోషల్ మీడియాలో SSMB 29 అనే ట్యాగ్ నే ట్రెండింగ్ లో ఉంచారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ పవర్ కి జక్కన్న దిగొచ్చాడు. ఈ కాంట్రవర్సీకి చెక్ పెట్టేసారు. లేటెస్ట్ గా తన నుంచి ఒక లెటర్ పీస్ ని రిలీజ్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో తన సినిమా SSMB29 అంటూనే ట్యాగ్ పెట్టి సంతకం చేశాడు జక్కన్న. దీనితో జక్కన్న సైడ్ నుంచి కూడా ఇది SSMB29 అని తేలడంతో మహేష్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఈ విధంగా మహేష్ ఫ్యాన్స్ ఇచ్చిన ఝలక్ తో జక్కన్న కిందకి దిగొచ్చాడు.
S S M B 29 pic.twitter.com/qkEFLH27Ih
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 18, 2025