Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే ఆ వ్యాఖ్యలను ఎక్కుపెట్టారు. మంత్రి పదవి రాలేదన్న అసహనంతో ఆయన ఇటీవల వరుస వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్న మాట వాస్తవమేనని, అధిష్ఠానం జరిపిన చర్చల్లో తానూ ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంగీకరించారు. దీనిపై ఏకంగా ఆయనకు రాజగోపాల్‌రెడ్డి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని ప్రజలకు తెలిపినందుకు ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.
Rajagopal Reddy: తాజాగా సీఎంపైనే రాజగోపాల్‌రెడ్డి బాణాలను ఎక్కుపెట్టారు. తనను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరమూ అన్నదమ్ములం ఉన్నామనే విషయం తెలియదా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రెండోసారి మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు తామిద్దరం అన్నదమ్ములమని తెలియదా? అని ప్రశ్నించారు.
Rajagopal Reddy: ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరమూ సమర్థులమేనని, ఇద్దరం గట్టివాళ్లమేనని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేమిటని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సమీకరణాలు కురరడం లేదని అంటున్నారని, ఎందుకు కుదరడం లేదని, ఎవరు అడ్డకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి ఇస్తేనే అడ్డుకుంటున్నారా? అని నిలదీశారు.
Rajagopal Reddy: 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తనకు కావాలనే మంత్రి పదవి ఇవ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు.

