Rains: గంటకు 30 కిమీ వేగంతో ఈదురుగాలులు.. ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడే అవాశాలున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. రానున్న రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు.

ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు పడతాయని తెలిపారు. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి ఆర్పీ సిసోడియా సూచించారు.

మరోవైపు, తిరుపతిలోని భారీ వర్షాలు పడుతున్న అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *