Railway Officials

Railway Officials: రైలు ఇంజిన్ డ్రైవర్లను కూల్ డ్రింక్స్ నీళ్లు తాగొద్దన్న అధికారులు.. ఏమి జరిగిందంటే..

 Railway Officials: రైలు ఇంజిన్ డ్రైవర్లు పనికి వచ్చినప్పుడు, వారు మద్యం సేవించారో లేదో నిర్ధారించడానికి బ్రీత్‌లైజర్‌ని ఉపయోగించి వారిని క్రమం తప్పకుండా పరీక్షిస్తారు. ఇటీవల కేరళలోని తిరువనంతపురం రైల్వే జోన్‌లో పనిచేస్తున్న రైలు ఇంజిన్ డ్రైవర్లకు నిర్వహించిన బ్రీత్‌అనలైజర్ పరీక్షల్లో వారు మద్యం సేవించినట్లు తేలింది. అయితే, వారు తాము మద్యం సేవించలేదంటూ మొత్తుకున్నారు. దీంతో వారికి రక్త పరీక్షలు చేశారు. అయితే, వారికి నిర్వహించిన రక్త పరీక్షలో వారి రక్తంలో ఆల్కహాల్ లేదని తేలింది.

కొంతమంది వ్యక్తులు ఆల్కహాల్ కలిగిన హోమియోపతి మందులు తీసుకోవడం వల్ల బ్రీత్ అనలైజర్ ఫలితాలు అలా వచ్చాయని తేలింది. అలాగే వీరిలో కొంతమంది “మేము పనికి వచ్చే ముందు పండ్లు తిన్నాము లేదా కూల్ డ్రింక్స్ తాగాము” వంటి వివిధ కారణాలను చెప్పారు.

ఇలా ప్రతిసారీ జరుగుతూ ఉండడంతో గందరగోళానికి గురైన తిరువనంతపురం రైల్వే జోన్ అధికారులు ఒక కఠినమైన ఆదేశాన్ని జారీ చేశారు. రైలు ఇంజిన్ డ్రైవర్లు పనికి వచ్చే ముందు కూల్ డ్రింక్స్, కొన్ని రకాల పండ్లు, మౌత్ వాష్, హోమియోపతి మందులు, దగ్గు మందులు తీసుకోవడంపై నిషేధం విధించారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: రాంకుల్లోనూ వినాయకుడే టాప్ . . ఏపీ ఆలయాల్లో కాణిపాకం ది బెస్ట్ అంట . . ఎలా అంటే . .

మీరు ఇలాంటివి ఏమైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటె, ముందుగానే ఆ విషయాన్ని వ్రాతపూర్వకంగా చెప్పాలి అంటూ అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా ఆల్కహాల్ కలిగిన మందులు తీసుకునే వారు రైల్వే వైద్య అధికారి నుండి వ్రాతపూర్వక అనుమతి పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి ఇంజిన్ డ్రైవర్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వారు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. పనిచేయని బ్రీత్ అనలైజర్ పరికరాన్ని మార్చకుండా అమలు చేయలేని ఆదేశాలు జారీ చేశారని వారు వాళ్ళు అధికారులపై విమర్శల దాడికి దిగారు. ఈ వివాదాల మధ్య, రైల్వే యంత్రాంగం విధుల్లో ఉన్నప్పుడు లోకో పైలట్లు నీరు, దగ్గు టానిక్స్ మొదలైనవి తినడాన్ని నిషేధించే తన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *