Davis Cup Finals 2024: డేవిస్ కప్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ఇప్పటికే ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రఫెల్ నడాల్.. చివరి సారి కోర్టులో దిగడం సందేహంగా మారింది. సింగిల్స్‌లో గెలిచే స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేనని అనుకుంటే పోటీ నుంచి తప్పుకుంటానని ఈ స్పెయిన్ ఆటగాడు తాజాగా ప్రకటించాడు. నెదర్లాండ్స్‌తో పోరులో మంగళవారం స్పెయిన్ తలపడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే స్పెయిన్ సెమీస్ చేరుతుంది. కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న నడాల్ చివరగా పారిస్ ఒలింపిక్స్ రెండో రౌండ్లో జొకోవిచ్ చేతిలో ఓడాడు. ముందుగా శిక్షణలో నా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సింగిల్స్‌లో గెలిచే స్థాయిలో లేనని అనుకుంటే వెంటనే పోటీకి దూరమవుతానని చెప్పడంతో నడాల్ పోటీకి దిగడంలో అనుమానాలు తలెత్తాయి.
