Puri – Sethupathi: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి సినీ ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఆయన తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఇప్పటికే ఓ ముఖ్య పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు రాధికా ఆప్టే ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. రాధికా ఆప్టే పాత్ర కూడా వైవిధ్యంగా, వెరైటీగా ఉంటుందని టాక్. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి వరుస డిజాస్టర్స్ తర్వాత పూరి ఈ సినిమాతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మరి, పూరి మ్యాజిక్ ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

