Rachin Ravindra Record: న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతమైన ఘనతను సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే వన్డే ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీలలో సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర అరుదైన గుర్తింపును పొందాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ రచిన్ రవీంద్రకు ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్ కాగా, అతను తన ప్రతిభను చాటుకున్నాడు.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో రచిన్ రవీంద్ర తీవ్ర గాయాన్ని ఎదుర్కొన్నాడు. క్యాచ్ పట్టే ప్రయత్నంలో బంతి అతని నుదిటిని తాకడంతో అతను గాయపడ్డాడు. ఈ సంఘటన వల్ల ఆ సిరీస్‌లో పాల్గొనలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఆడలేదు. అయితే, కొంత కోలుకున్న తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టులోకి తిరిగి ప్రవేశించాడు.
ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగి అసాధారణ ప్రదర్శనను కనబర్చాడు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట పరిస్థితిలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేతో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత టామ్ లాథమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అతను 95 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఈ శతకంతో రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీలలో అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.
ఇది కూడా చదవండి: RCBW vs UPW: సుపర్ ఓవర్ లో ఆర్సిబి పై యూపీ ఘన విజయం..! పాపం పెర్రీ..!
వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు 19 మంది బ్యాటర్లు తమ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించగా, ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది తమ తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించారు. అయితే, రెండు టోర్నీలలో అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర నిలిచాడు.
వన్డేల్లో రచిన్ రవీంద్రకు ఇది నాలుగో శతకం. కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే అతను నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ఈ నాలుగు సెంచరీలు అన్నీ ఐసీసీ ఈవెంట్స్‌లో సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం. రచిన్ రవీంద్ర సెంచరీతో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
అయితే ఇప్పుడు రవీంద్ర ఇచ్చిన పర్ఫార్మెన్స్ న్యూజిలాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. నిజానికి మొదటిగా తుదిచెట్టులో ప్రతి రవీంద్ర లేడు. అయితే చివరి నిమిషంలో డారెల్ మిచెల్ అనారోగ్యంతో జట్టులో నుండి తప్పుకోవడంతో అతని స్థానంలోకి రవీంద్ర వచ్చాడు అయితే ఇప్పుడు రవీంద్ర అద్భుతమైన సెంచరీ సాధించడం వచ్చే మ్యాచ్ కు మిచెల్ కూడా అందుబాటులో ఉండడంతో మరి ఏ ఆటగాడు అని తీసేయాలి అని న్యూజిలాండ్ తర్జనభర్జన పడుతోంది.