Rabis Deaths:రేబిస్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి సోకిన వారిలో 9 నిమిషాలకు ఒకరి చొప్పున చనిపోతున్నారు. ఈ మరణాలు భారతదేశంలోనే అత్యధికంగా జరుగుతున్నాయని తేలింది. ప్రపంచంలో జరిగిన వాటిలో భారతదేశంలో మూడో వంతు మరణాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా ఆయా అంశాలను వెల్లడింది.
Rabis Deaths:రేబిస్ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని, దాని నివారణకు వ్యాక్సినేషన్ చేయించాలని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలకు సూచించింది. 2023 సంవత్సరంలో భారతదేశంలో 284 రేబిస్ వ్యాధితో మరణాలు సంభవించాయని ఐడీఎస్పీ (ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) తేల్చి చెప్పింది. కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండటంతోనే ఈ దారుణాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మేరకు దీనిపై పార్లమెంట్‌కు నివేదికను కూడా అందజేసింది.
Rabis Deaths:ప్రపంచంలోని పలు దేశాల్లో 70 శాతం సాధించి రేబిస్ నివారించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారతదేశంలో కూడా ఆ ప్రక్రియను అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఢిల్లీ నగరంలో వీధి కుక్కలకు షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఇటీవలే కూడా ఓ కీలక ఆదేశాలను జారీ చేస్తే జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో న్యాయస్థానం ఆ ఆదేశాల్లో సడలింపులను ఇవ్వాల్సి వచ్చింది. కానీ, విచ్చలవిడిగా పెరుగుతున్న వీధి కుక్కలతో పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నదని మాత్రం వారు భావించడం లేదని మరికొందరు హితవు పలుకుతున్నారు.
రేబిస్ లక్షణాలతో ఏపీలో ఓ వ్యక్తి మృతి
Rabis Deaths:ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతుందన్న ఓ నివేదిక వచ్చిన వేళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే రేబిస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గోవిందాపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు (37) అనే వ్యక్తి రేబిస్ వ్యాధి లక్షణాలతో చనిపోయాడు.
Rabis Deaths:అదపాక లింగంనాయుడుకు గత ఆగస్టు 30వ తేదీన వీధి కుక్క కరిచింది. దీంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు వ్యాక్సిన్లు వేయించారు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో విశాఖలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా, రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. అక్కడే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొన్నది.