Putin India Visit

Putin India Visit: రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు ఘన స్వాగతం: త్రివిధ దళాల గౌరవ వందనం

Putin India Visit: రెండు రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయం ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పుతిన్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం, రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

గౌరవ వందనం తర్వాత, ఇరు దేశాల ప్రతినిధి బృందాల అధికారులను పుతిన్, మోదీ పరస్పరం పరిచయం చేసుకున్నారు. గురువారం రాత్రి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రైవేటు విందు అనంతరం, పుతిన్ అధికారిక పర్యటన శుక్రవారం ఉదయం ఈ స్వాగత కార్యక్రమంతో మొదలైంది.

Also Read: iBomma Ravi: ఐబొమ్మ రవికి జాబ్ ఆఫ‌ర్.. డీసీపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం ముగిసిన తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో రాజ్‌ఘాట్‌కు బయలుదేరి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. అనంతరం, హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి 23వ భారత్-రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలలో దాదాపు 25 ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *