Gold rate: జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఈరోజు అంటే డిసెంబర్ 9న 24 కేరట్ గోల్డ్ ధర 78,455 రూపాయల పరిధిలో ఉన్నది. 22 కేరట్ గోల్డ్ ధర 71,300 రూపాయల వద్ద ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థానిక పన్నులు . . ఇతర అంశాల కారణంగా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది . ఇక గత కొన్ని వారాలుగా గోల్డ్ ధరలు హెచ్చుతగ్గులతో కొనసాగుతుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వాల విధానాలు, పసిడి డిమాండ్ ప్రభావంతో గోల్డ్ ధరలు పెరిగిపోతున్నాయి.
పసిడి ధరల ప్రభావాలు:
ఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్థిక స్థితి గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తోంది. యూరోపియన్, అమెరికన్ మార్కెట్లలో డాలర్ విలువ తగ్గిపోవడం, పసిడి ధరలను ప్రభావితం చేసింది.
నగరాల వారీగా ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి . .
హైదరాబాద్: 24 కేరట్ – (10 గ్రాములకు) 78,455 రూపాయలు, 22 కేరట్ – 71,300 రూపాయలు.
ఢిల్లీలో 24 కేరట్ – (10 గ్రాములకు) 78,260 రూపాయలు, 22 కేరట్ – 71,300 రూపాయలు.
చెన్నై: 24 కేరట్ – (10 గ్రాములకు) 78,650 రూపాయలు, 22 కేరట్ – 71,500 రూపాయలు.
ముంబై: 24 కేరట్ – (10 గ్రాములకు) 78,265 రూపాయలు, 22 కేరట్ – 71,255 రూపాయలు.