Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప2’ మేనియా నెలరోజుల ముందే మొదలైంది. రిలీజ్ కి ఇంకా నెలపైగా ఉండగానే అమెరికాలో బుకింగ్స్ మొదలయ్యాయి. ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో సూపర్ హిట్ కావటంతో పాటు హీరోగా నటించిన బన్నీ జాతీయ అవార్డ్ ను సాధించటంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రదర్శితం కాబోతున్న ఈ సీక్వెల్ కి సంబంధించి పూర్తి స్థాయి బుకింగ్స్ ను అమెరికాలో నవంబర్ 4వ తేదీకి ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఐటమ్ సాంగ్ చిత్రీకరణ మిగిలిఉంది. దానిని ఈ వారంలో నే ఆరంభించనున్నారు. ఇక ఇటీవల వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలైన ‘కల్కి2898’, ‘దేవర’కు యుఎస్ మార్కెట్ లో అద్భుతమైన ఆదరణ లభించిన నేపథ్యంలో ‘పుష్ప2’పై అంతకు మించి అనేలా ఆసక్తి నెలకొని ఉంది. ఓపెనింగ్ రోజునే దాదాపు 200 కోట్ల వసూళ్ళు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. అమెరికాలో 4వ తేదీనే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. మరి ఈ మేనియా రిలీజ్ నాటికి ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.
