Pushpa 2:

Pushpa 2: పుష్పు-2 సినిమా విడుద‌ల‌కు మ‌రో లైన్ క్లియ‌ర్‌

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ న‌ట్టించిన పుష్ప‌-2 సినిమా విడుద‌ల‌కు మ‌రో అడ్డంకి తొల‌గింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ల రేట్ల పెంపున‌కు ఆయా ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇచ్చాయి. బెనిఫిట్ షోకు కూడా అధిక టికెట్ వ‌సూళ్ల‌కూ అనుమ‌తి ద‌క్కింది. అయితే టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయంటూ ఓ జర్న‌లిస్టు వేసిన పిటిష‌న్‌పై కేసు విచార‌ణ‌ను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో పుష్ప‌-2 సినిమా విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్ అయింది.

Pushpa 2: సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉండ‌టంతోపాటు బెనిఫిట్ షో పేరిట రూ.800 చొప్పున అధిక మొత్తంలో వ‌సులు చేయ‌డం అన్యాయ‌మంటూ జ‌ర్న‌లిస్టు స‌తీశ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే సినిమా విడుద‌ల‌ను చివ‌రి నిమిషంలో ఆప‌లేమ‌ని, త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు కోర్టు వాయిదా వేసింది.

Pushpa 2: ఇదిలా ఉండ‌గా, పుష్ప 2 సినిమా టికెట్ల‌ను దేశ‌వ్యాప్తంగా అధిక మొత్తంలో పెంచారంటూ అభిమానులు, సామాన్య ప్రేక్ష‌కులు కూడా పెద‌వి విరుస్తున్నారు. ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 4న బెనిఫిట్ షోల‌తో, 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టికెట్లు కొన్నిచోట్ల వేల‌ల్లో కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pushpa-2: పుష్ప -2 లేటెస్ట్ అప్‌డేట్స్ కెవ్వు కేక‌.. సంచల‌నాలు త‌గ్గేదెలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *