Puri Jagannath: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి నిరాశపరిచిన చిత్రాల తర్వాత, పూరి తన కొత్త సినిమాను విజయ్ సేతుపతి హీరోగా ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటిస్తుండగా, మరో బాలీవుడ్ నటి కూడా జోడైందని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మాణంలో ఉంది. జూన్‌లో విజయ్ సేతుపతిపై ఓపెనింగ్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. పాత్రలన్నీ వైవిధ్యంతో, బలమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని టాక్.
Also Read: Trump: ట్రంప్ సంచలనం: సినిమా పరిశ్రమకు బిగ్ షాక్!
Puri Jagannath: ‘డబుల్ ఇస్మార్ట్’లో కంటెంట్ లోపించిందన్న విమర్శల నేపథ్యంలో, పూరి ఈసారి గట్టి కథతో వస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో పూరి తన గత విజయాలను పునరావృతం చేస్తాడా? అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
తలైవన్ తలైవి – టైటిల్ టీజర్ :

