Haryana:భార్యాభర్తల విడాకుల విషయంలో పంజాబ్& హర్యానా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్యాభర్తల విభేదాల విషయంలో పలు కీలక కేసులు కోర్టుల్లో తేలుతున్నా.. ఇదొక అరుదైన కేసుగా పేర్కొనవచ్చు. ఎక్కువ కేసుల్లో భర్తల వేధింపులు, వరకట్న బాధలు ఇతర విషయాలు ఉంటుంటాయి. కానీ ఈ విషయంలో భార్య విచిత్రమైన వేధింపులు కారణమయ్యాయి. ఈ విషయంలో భార్య నుంచి ఆ భర్తకు విముక్తి కల్పించేందుకు కోర్టు తీర్పునిచ్చింది.
Haryana:హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. కొంతకాలం బాగానే కాపురం సాగింది. అయితే కొంతకాలానికే వారి మధ్య విభేదాలు పొడచూపాయి. రోజూ వారి మధ్య రచ్చ జరిగేది. పడక గదిలో భర్తను విచిత్ర కోరిక కోరేదట. అతను స్పందించకపోతే తీవ్రంగా దుర్భాషలాడేదట. ఆ బాధలు భరించలేకపోయాడు. ఎంతగా నచ్చజెప్పినా వినేది కాదట.
Haryana:రోజూ రాత్రిపూట తన భార్య కనీసం 15 నిమిషాల చొప్పున, మూడు సార్లు సంభోగం జరపాలని అనేదని, ఇదంతా ఫోన్‌లో రికార్డు చేయాలని తన భర్తను బలవంత పెట్టేదట. అవ్వకపోతే తనతో పోటీపడటం నీవల్ల కావడం లేదు, కొజ్జాగాడివి, వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటా అంటూ భర్తను వెక్కిరించేదట. ఈ తంతు నిత్యం జరుగుతుండటంతో ఆ భర్త మనోవేదనకు గురయ్యాడు. తన భార్యతో వేగలేకపోయిన ఆ భర్త.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ కింది కోర్టును ఆశ్రయించాడు.
Haryana:భార్యాభర్తల విషయాలను పరిశీలించిన ఆ కింది కోర్టు ఇద్దరికీ విడాకులను మంజూరు చేసింది. మరి ఏమైందో ఏమో కానీ, ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు వద్దనుకున్నది. దీంతో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్& హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పూర్వాపరాలను, కింది కోర్టు తీర్పును పరిశీలించిన హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్తను కొజ్జా అని పిలువడం తప్పే.. అని నిర్ధారించింది. ఈ విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబే అని నిర్ణయించింది. ఈ మేరకు ఆ మహిళ నుంచి ఆమె భర్తకు విడాకులు ఇప్పించింది.