Narendra Modi: భారత టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.గత వారం రిటైర్మెంట్ ప్రకటించిన పుజారాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక లేఖ రాశారు, ఆయన క్రికెట్ కెరీర్‌లో సాధించిన విజయాలను ప్రశంసించారు. ఈ లేఖల టెస్ట్ క్రికెట్ అందాన్ని, పుజారా సహకారాన్ని మోడీ ప్రశంసించారు. చిన్న ఫార్మాట్ల క్రికెట్ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ సమయంలో.. మీరు ఆట సుదీర్ఘ ఫార్మాట్ బ్యూటీని గుర్తు చేశారు” అని మోదీ ప్రశంసించారు. పుజారా తన స్వభావం, అపారమైన ఏకాగ్రతతో ఎక్కువ గంటలు బ్యాటింగ్ చేసే సామర్థ్యం భారత బ్యాటింగ్ లైనప్‌కు ఒక మూలస్తంభంగా నిలిచాయని కొనియాడారు. ముఖ్యంగా.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించడంలో పుజారా పోషించిన కీలక పాత్రను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆస్ట్రేలియాలో అత్యంత పవర్‌ఫుల్ బౌలింగ్ అటాక్‌లలో ఒకదానికి వ్యతిరేకంగా నిలబడి, జట్టు కోసం బాధ్యత తీసుకోవడం అంటే ఏంటో మీరు చూపించారు” అని అభినందించారు.
ఇది కూడా చదవండి: Senani Sandesham: “త్రిశూల్” : జనసేనకు మరో మైలు రాయి కాబోతోందా?
ప్రధాని మోదీ రాసిన లేఖకు పుజారా కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, “నా రిటైర్మెంట్ సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నుండి ప్రశంసా పత్రం అందుకోవడం గౌరవంగా ఉంది. మీ మాటలకు ధన్యవాదాలు. నేను నా రెండవ ఇన్నింగ్స్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు, మైదానం అన్ని జ్ఞాపకాలను, నాకు లభించిన ప్రేమను గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు సర్.” అని పోస్ట్ చేశాడు.
2010లో భారత్ తరఫున చతేశ్వర్ పుజారా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 103 టెస్ట్ మ్యాచ్‌ల్లో 7,195 పరుగులు చేశాడు, వాటిలో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 206 (నాటౌట్). భారత్ తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 2018–19 బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పుజారా 521 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ వంటి బౌలర్లలను ఎదుర్కొంటూ భారత జట్టుకు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించాడు.