Property Rates: మధ్యప్రదేశ్ ప్రభుత్వం 54 జిల్లాల్లోని 3500 స్థానాల్లో ప్రాపర్టీ రేట్లను పెంచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు ఆస్తులపై స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదన పంపారు. దీంతో ఇండోర్, గ్వాలియర్‌లోని అనేక ప్రదేశాలలో ప్రాపర్టీ ధరలు 3% అలాగే గ్వాలియర్‌లో కొన్ని చోట్ల 2% పెరిగాయి. అయితే, ప్రస్తుతం భోపాల్‌లో ధరలు మాత్రం యధాతథంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: ప్రభుత్వ ఉద్యోగులపై మనీలాండరింగ్ కేసులు.. అధికారుల అనుమతి తప్పనిసరి
భోపాల్ ఎంపీ అలోక్ శర్మ ఆస్తుల ధరల పెరుగుదలను వ్యతిరేకించారు. ఆయన ఈ విషయంలో ఆర్థిక మంత్రి జగదీష్ దేవరాను కలిశారు. అంతేకాకుండా, భోపాల్ క్రెడాయ్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రాపర్టీ ధరల పెంపుదలను వ్యతిరేకించింది. ఇప్పుడు భోపాల్ కలెక్టర్ క్రెడాయ్ వాదనలను వినాల్సి ఉంది. ఆతరువాత ఆపై ప్రాపర్టీ ధరలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.