Chhattisgarh: అయ్యా ..ఏందయ్యా ఇది. ఇది ఎక్కడ చూడలా …వేల రూపాయల కోళ్లు ఆలా ఎలా తినేశావయ్యా ? మనిషివా ..లేకా ..మరో గ్రహం నుంచి వచ్చిన ..వాడివా ? అయినా వాడు ఎదో చెప్పాడు అనుకో…నువ్వైనా ఎలా నమ్మేశావ్. రెండు లక్షల లోన్ కోసం ..వారం వారం అక్కడికి రావడం..కోడిని తినేయడం. ఫామ్ లో కోళ్లు ఐతే తగ్గిపోతున్నాయి కాని …లోన్ మాత్రం మంజూరు కాలేదు . ఆహా ఇలా ఉన్నావా అని మొత్తానికి మోసపోయిన ఆ పెద్దాయన ..బకాసురిడిపై రక్షకభటులు ఫిర్యాదు చేసాడు.
ఓ బ్యాంక్ మేనేజర్‌కు నాటు కోడి కూర అంటే మహా ఇష్టం. పుష్టిగా నాటు కోడి కూర తినాలని కలలు కన్నాడు. కానీ చేస్తున్న ఉద్యోగం రిత్యా అలాంటి అవకాశం దొరకలేదు. ఈ క్రమంలో అతడికి ఓ జాక్‌పాట్ లాంటి ఐడియా తట్టింది. ఇంకేం రోజూ నాటు కోడి కూర తినేద్దామని ప్లాన్ వేశాడు.
Chhattisgarh: లోన్ ఇస్తానని నమ్మించి ఏకంగా రూ.39 వేల విలువ చేసే నాటు కోళ్లు తినేశాడు. ఆకలితో ఉన్న బకాసురుడి మాదిరి కోళ్లను నమిలేసిన ఆ బ్యాంకు మేనేజర్‌ని తీరా లోన్ గురించి అడగ్గా ప్లేట్ తిప్పేశాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటుచేసుకుంది.
మస్తూరి పట్టణానికి చెందిన రైతు రూపచంద్ మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించిన రైతు స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి, రూ.12 లక్షల లోన్ అడిగాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు.
Chhattisgarh: లోన్ వస్తదన్న ఆశతో మన్హర్ బ్యాంకు మేనేజర్‌కి రోజూ నాటు కోడి మాంసం తెచ్చివ్వసాగాడు. అలా మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు మేనేజర్ తినేశాడు. పైగా లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా చెల్లించాడు. లోన్ కావాలంటే ప్రతి శనివారం నాటు కోడి మాంసం కావాలని అడగటం, మరో చోట కోడిని కొని తీసుకురావడం రైతుకు దినచర్యగా మారిపోయింది.
అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని భావించి, తనను మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్‌బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మేనేజర్‌కు ఇచ్చిన కోళ్ల తాలూకు బిల్లులు కూడా పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.