Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తమిళ హిట్ ‘తేరి’ రీమేక్ అని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నిర్మాత రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Mass Jathara OTT: ఓటీటీలోకి మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాక్సిమం షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. గతంలో ఈ సినిమా విజయ్ ‘తేరి’ రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత రవి ఇటీవల స్పందిస్తూ ఈ చిత్రంలో ‘తేరి’ కోర్ పాయింట్ మాత్రమే తీసుకున్నామని, మిగతా కథను పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు, తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చామని స్పష్టం చేశారు. రీమేక్ ఫీల్ ఎక్కడా ఉండదని, బలమైన కంటెంట్‌తో భారీ సెన్సేషన్ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ వంటి రీమేక్‌ను సొంతంగా మలిచిన అనుభవం ఉండటంతో అభిమానులు ఈ చిత్రంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ అవతారం మరోసారి పండగ వాతావరణం తెప్పించే అవకాశం కనిపిస్తోంది.

