Priyanka Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల 14వ రోజైన శుక్రవారం లోక్‌సభలో రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న అంశంపై చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. 1 గంటా 10 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో, కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిందని, రాజ్యాంగం కంటే తమ స్వంత ప్రయోజనాలను పరిరక్షించిందని, ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు.
రాజ్‌నాథ్ తర్వాత, ప్రతిపక్షాల వైపు నుంచి ప్రియాంక గాంధీ 31 నిమిషాల్లో రాజనాధ్ సింగ్ ప్రతి ప్రకటనకు సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాతల్లో నెహ్రూ పేరును రక్షణ మంత్రి తీసుకోరని ప్రియాంక అన్నారు. మేము ఎక్కడ అవసరం వచ్చినా కచ్చితంగా తీసుకుంటాం. ఇంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం మీదే, ఏం చేశారో ప్రజలకు చెప్పండి అంటూ ప్రియాంక నిలదీశారు.
ఇది కూడా చదవండి: Pradeep Kumar: పాకిస్తాన్ గూఢచారిగా ఆరోపణలు.. ఇప్పుడు జడ్జ్.. ఎలా అంటే?
Priyanka Gandhi: ప్రియాంక మాట్లాడుతూ- పార్లమెంటులో ప్రధాని రాజ్యాంగం గురించి మాట్లాడతారు. సంభాల్, హత్రాస్, మణిపూర్ హింసపై న్యాయం సమస్య తలెత్తినప్పుడు, దాని గురించి మాట్లాడని మాట్లాడారు అని అన్నారు. రాజు వేషాలు వేస్తాడు కానీ, విమర్శలు వినే ధైర్యం లేదు అంటూ ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగం దేశానికి కవచం లాంటిది అనీ, పదేళ్లుగా దానిని బద్దలు కొట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ఎంపీగా ప్రియాంక లోక్‌సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి.