Priyadarshi: టాలీవుడ్‌లో నాని ఒకప్పుడు క్లాస్ సినిమాలు, కామెడీతో కూడిన ఎమోషనల్ కథలతో ప్రేక్షకుల మనసు గెలిచాడు. మాస్ సినిమాలకు దూరంగా కంటెంట్‌తో హిట్లు కొట్టి సొంత ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో ప్రియదర్శి వెళ్తున్నాడని టాక్. కథ, కామెడీని మేళవించి ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియదర్శి.. ‘బలగం’, ‘జాతిరత్నాలు’, ‘కోర్టు’ సినిమాలతో హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తున్నాడు. మనుషుల చిన్న చిన్న నమ్మకాలు, లోపాలను ఆధారంగా చేసుకుని కామెడీ జానర్‌లో సినిమాలు చేస్తూ మిడిల్ క్లాస్ ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అవుతున్నాడు.
తాజాగా వస్తున్న ‘సారంగపాణి జాతకం’ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన చిత్రమని బజ్. ప్రియదర్శి సినిమాలంటే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది. నాని లాగే తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్న ప్రియదర్శి.. స్టార్ హీరోగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నాడు. మరి, నాని స్థాయిలో సక్సెస్ సాధిస్తాడా? వేచి చూడాలి!