NTR: ఎన్టీఆర్ సాధారణ పౌరుడిలా రోడ్ మీద తిరిగేస్తున్నాడు. అదేంటే అంత ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎలా జనాల్లో తిరిగేస్తున్నాడా అనుకుంటున్నారా? ఎన్టీఆర్ తిరిగేది స్కాట్ లాండ్ లో మరి. అక్కడి సోషల్ మీడియా ఇన్ ఫు లెన్సర్ తీసిన వీడియోలో అలా ఎలాంటి చీకుచింత లేకుండా తిరిగేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ వీడియోను ఎన్టీఆర్ కు తెలియకుండా తీశాడా ఇన్ఫూలెన్సర్. స్కాట్ లాండ్ కి చెందిన ఇన్ఫూలెన్సర్ ఎడిన్ బర్గ్ క్రిస్మస్ మార్కెట్ అందాలు షూట్ చేస్తున్న టైమ్ లో ‘ఆర్ఆర్ఆర్’తో వరల్డ్ ఫేమస్ అయిన ఎన్టీఆర్ ను గుర్తుపట్టి వీడియో తీసేశాడట. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ‘వార్2’షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూట్ లో జాయిన్ కావలసి వుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రశాంత్ నీల్ తెలిపాడు.
View this post on Instagram